చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ - పంట పొలాలు ధ్వంసం
🎬 Watch Now: Feature Video
Elephant Herd Attack On Crop Fields : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాల్లో హల్చల్ చేశాయి. వి.కోట మండలంలోని గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దానమయ్యగారిపల్లి, కుమ్మరిమడుగు, మిట్టూరు, నక్కనపల్లి, మోట్లపల్లి, బాలేంద్రపల్లి తదితర గ్రామాల్లోని పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. గుంపుగా వచ్చిన 14 ఏనుగులు ఆదివారం రాత్రంతా పంట పొలాలపై పడి అరటి, కాకరకాయ, చెరకు తోటలను నాశనం చేశాయి.
Farmers Who Lost Crops : పొలాల్లో ఉన్న గజేంద్రుల గుంపును చూసి వాటిని తరిమేందుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో ఏనుగుల గుంపును అడవిలోకి తరిమేందుకు రైతులు ప్రయత్నించారు. పంట పొలాలపై ఏనుగుల గుంపు స్వైర విహారం కారణంగా లక్షల్లో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఏనుగుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.