Donkeys Procession for Rain : వర్షాల కోసం వినూత్న పూజలు.. వరుణుడు కరుణిస్తాడనే నమ్మకంతో గాడిదల ఉరేగింపు - Rituals for Rains
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 10:07 AM IST
Donkeys Procession for Rain: వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాల కోసం అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. కొంత మంది వివిధ రకాల పూజలు చేస్తుంటే.. మరికొంత మంది తమ గ్రామాల్లో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లాలోని రైతులు సైతం వింత ఆచారం పాటిస్తున్నారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణిస్తాడని నమ్ముతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గంలో వర్షం కోసం గాడిదల ఉరేగించారు. అనాదిగా వస్తున్న ఆచారమని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వేరుశనగ పంట వేసిన రైతులు వర్షాలు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని రోజుల్లో వర్షం పడకపోతే పంటను తొలగించే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో వర్షం కోసం.. మండలంలోని హరేసముద్రం గ్రామంలో రైతులు గాడిదలను పూలతో అలంకరించి, తప్పెట్ల శబ్దాలతో ఊరేగించారు. గాడిదలు శబ్దాలకు అనుగుణంగా అరుస్తూ ఊరేగింపులో ముందుకు సాగాయి. నోరులేని గాడిదల అరుపులకు వరుణదేవుడు కరుణించి వర్షం కురిపిస్తాడని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.