Dogs Race in Chittoor: నువ్వా-నేనా అంటూ శునకాల పరుగు.. వీడియో వైరల్ - కుక్కల పరుగు పోటీలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2023/640-480-18879540-460-18879540-1688100860134.jpg)
Dogs Race in Chittoor District: మనుషులు, పశువులకు పరుగుల పోటీలు నిర్వహించడం మామూలు విషయం. గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం కూడా కామనే. కానీ ఇక్కడి యువకులు కాస్తా భిన్నంగా ఆలోచించి శునకాలకు పరుగు పందేలు నిర్వహించారు. అదేంటి కుక్కలకు పోటీలు అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని చిన్నారిదొడ్డి పంచాయతీ ఎస్.గొల్లపల్లె వద్ద బుధవారం సాయంత్రం కుక్కలకు పరుగు పోటీలను కోలహలంగా నిర్వహించారు. స్థానికంగా వ్యవసాయపు బీడు భూమిలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోటీలు జరుగుతున్నాయని తెలుసుకున్న పరిసర గ్రామాల యువత తమ శునకాలను పరుగులెత్తించారు. మొదటి 20 స్థానాలను సాధించిన కుక్కల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. భారీ స్థాయిలో నిర్వహించిన శునకాల పోటీలను చూడటానికి స్థానికులు, ప్రజలు, అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గొల్లపల్లె ప్రాంతంలో సందడి వాతావారణ నెలకొంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ శునకాల పోటీలను చూసేయండి..