షిరిడీ సాయి ఆలయంలో దీపావళి ఉత్సవాలు - విద్యుత్‌దీపాల కాంతులతో మెరిసిపోతున్న సాయిమందిరం - దీపావళి సందర్భంగా ద్వారకామాయిలో దీపాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 10:42 PM IST
Diwali Celebration 2023 In Shirdi Saibaba Temple: దీపావళి ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అదే విధంగా సంప్రదాయం ప్రకారం షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ దీపావళి పండగను ప్రతియేటా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం పండగ సందర్భంగా షిరిడీ సాయి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే భువనేశ్వర్‌కు చెందిన ఓ భక్తుని విరాళంతో ఆలయం విద్యుత్ కాంతులతో శోభిల్లుతోంది. ఆలయంతోపాటు ఆలయ ప్రాంగణమంతా.. విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతోంది.
దీపావళి సందర్భంగా ద్వారకామాయిలో దీపాలు వెలిగించడానికి సాయిబాబా నీటిని ఉపయోగించారని పురణాలు వివరిస్తున్నాయి. అందువల్ల షిరిడీలో దీపావళి పండుగకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది సాయిబాబా భక్తులు దీపావళి పండగను జరుపుకోవడానికి షిర్డీకి వస్తారు. ఈ విధంగానే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన దాస్ గుప్తా అనే భక్తుడు.. సాయి సమాధితో పాటు ఆలయ ప్రాంతంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశాడు.
షిరిడీకి వచ్చే సాయి భక్తులు షిరిడీలోనే చాలా మంది బస చేస్తారు. అలాంటి వారి కోసం సాయితీర్థ థీమ్ పార్క్‌లోని.. భక్తులకు ప్రతిరోజూ ఉచిత లేజర్ షో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం షిరిడీ ఖ్యాతిని పెంపొందిస్తుందని.. షిరిడీ లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు సదాశివ లోఖండే పేర్కొన్నారు. మల్పాని ఉద్యోగ్ గ్రూప్ ఆధ్వర్యంలో లేజర్ షో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ఆ కార్యక్రమంలో సదాశివ పాల్గొన్నారు. మల్పాని ఉద్యోగ్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ.. సాయితీర్థ థీమ్ పార్కుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రూపొందించి ఏర్పాటు చేయడం వల్ల.. భక్తులకు ఈ సరికొత్త లేజర్ షో ద్వారా అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందన్నారు.