Jagananna Suraksha Program: 'మన రాష్ట్రాన్ని చూసి 28 రాష్ట్రాల వాళ్లు ఫాలో అవుతున్నారు' - 28 states are following our state

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2023, 9:39 PM IST

Dharmana Prasada Rao Participate in Jagananna Suraksha Program : ప్రజలు తలెత్తి.. గౌరవంగా సంక్షేమ పథకాలు తీసుకొనేలా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీర్చిదిద్దిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం బాపూజీ క‌ళామందిరంలో నిర్వహించిన 'జగనన్న సురక్ష కార్యక్రమం'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ ఏమి చేస్తారని, రాష్ట్రాన్ని పాడు చేస్తారని రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నాయని మంత్రి ధర్మాన గుర్తు చేశారు. అప్పుడు వారి మాటలను రాష్ట్రంలోని అందరూ నమ్మారని.. కానీ సీఎం జగన్ అన్ని విధాలా మనసు పెట్టి గౌరవమైన పద్దతిలో, నిజాయితీతో పని చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాడని చెప్పారు. మన రాష్ట్రాన్ని చూసి 28 రాష్ట్రాల వాళ్లు ఫాలో అవుతున్నారని మంత్రి అన్నారు. జనాలు బిక్కుబిక్కుమని కూర్చుంటే అది అభివృద్ధా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి అనే పదానికి నిర్వచనం తెలియని వాళ్ల మాటలను తిప్పి కొట్టాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.