బిక్కవోలు గణపతికి.. లక్ష ఉండ్రాళ్లతో నైవేద్యం - లక్ష్మీ గణపతి స్వామి
🎬 Watch Now: Feature Video
Offering One Lakh Undrallu to Lord Lakshmi Ganapati: వినాయక స్వామికి ఉండ్రాళ్లు అంటే ఎంత ఇష్టమో చాలా మందికి తెలుసు కదా.. దీని గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం కూడా. అందుకే ఓ భక్తుడు స్వామి వారికి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టారు. ఇందులో ఏం ప్రత్యేకత ఏం ఉందనేగా మీ సందేహం. ఆ భక్తుడు ఇచ్చింది ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా లక్ష ఉండ్రాళ్లను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి లక్ష ఉండ్రాళ్లను విశాఖపట్నంకి చెందిన భక్తులు అంబటి బలరామిరెడ్డి, నాగమణి దంపతులు నైవేద్యంగా సమర్పించారు. బలరామిరెడ్డి దంపతులు.. 1100 కేజీల నూకతో పలువురు మహిళలతో కలిసి నిష్టగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఉండ్రాళ్లను తయారు చేశారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా బలరామిరెడ్డి నాగమణి దంపతులు లక్ష్మీ గణపతి హోమాన్ని చేశారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. లక్ష ఉండ్రాళ్లను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.