Crops Dying Due to No Irrigation Water : అయ్యో అన్నదాత..! పొట్ట దశలో ఎండుతున్న పొలాలు.. కంట తడి పెడుతున్న రైతులు - ap latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 3:23 PM IST

Crops Dying Due to No Irrigation Water in Krishna District : వైఎస్సార్సీపీ  పాలనలో ఓవైపు కరెంటు కోతలు.. మరోవైపు  వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం చేయడమే శాపంగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు. పంటలు పండించేందుకు ప్రభుత్వం కనీసం సాగునీరు ఇవ్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందకపోవడంతో పొట్ట దశలో ఉన్న వరి పొలాలు మాడిపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేశామని, పంట చేతికి రాకపోతే పురుగుమందు తాగి చనిపోవడమేనని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. 

Farmers Worried about Power Cuts in AP : సాగునీరు అందక కృష్ణ జిల్లాలో చాలా చోట్ల వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలోని కంకిపాడు మండలం ఉప్పులూరులో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం కాలువల ద్వారా పంటలకు నీరు ఇవ్వడం లేదని, కనీసం బోర్ల ఆధారంగా వ్యవసాయం చేయాలన్నా విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు ఇవ్వాలని రైతులు వరి పొలాల్లో ద్విచక్రవాహనాలు నడిపి నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.