50రోజుల ఉత్కంఠకు తెర - ఎట్టకేలకు మొసలిని బంధించిన అటవీ శాఖ అధికారులు - Crocodile rescue operation
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 12:43 PM IST
Crocodile in Crop Canal: కోనసీమ జిల్లా అమలాపురంలో 50 రోజులుగా ప్రధాన పంట కాలువలో మొసలి సంచరిస్తోంది. ఐదు గ్రామాల ప్రజలకు కంటిన్యూగా కునుకు లేకుండా చేసిన మొసలి ఎట్టకేలకు చిక్కింది. అఖండ గోదావరి నుంచి సెప్టెంబరు 21న మెుసలి అమలాపురం ప్రధాన పంట కాలువలోకి ప్రవేశించింది. అదే రోజు ఆత్రేయపురం వద్ద పంట కాలువలో స్థానికులకు కనిపించింది.
Zoo Officers Catches Crocodile: 20 రోజుల క్రితం నడిపూడి, కామనగరువు, సమనస, అమలాపురం గ్రామాల మధ్య ప్రధాన పంట కాలువలో సంచరిస్తూ స్థానికులకు కనిపించింది మొసలి. దీనికోసం అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేసినా చిక్కలేదు. మరలా మూడు రోజుల క్రితం ప్రధాన పంట కాలువలోంచి సమనస లాకుల వద్ద రాత్రి సమయంలో ప్రధాన రహదారి మీదకు వచ్చింది. స్థానికులు లైట్లు వేయడంతో క్షణాల్లో తిరిగి ప్రధాన పంట కాలువలోకి వెళ్లిపోయింది. దీంతో అటవీ శాఖ అధికారులతో పాటు విశాఖపట్నం జూ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి.. ఈరోజు మొసలిని బంధించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.