వినూత్న రీతిలో భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు- శాండ్ ఆర్ట్ అదుర్స్ - క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ఆర్ట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 7:30 PM IST

Cricket World Cup Sand Art: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్​ సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో క్రికెట్ ప్రంపచ కప్ తుదిపోరు(Cricket World Cup Final Match) జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు తమదైన రీతిలో టీమిండియాకు మద్దతు శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ కోవలోనే గుంటూరుకు చెందిన ఓ అభిమాని మాత్రం వినూత్న రీతిలో టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 

Cricket World Cup Trophy Drawing: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ శాండ్ ఆర్ట్ ద్వారా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటి వరకు అద్భుత రీతిలో ప్రదర్శన కనబరిచిన జట్టు.. ఫైనల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబర్చి కోట్లాది మంది భారతీయల ఆకాంక్షలు నెరవేర్చాలంటూ అభినందనలు తెలియజేశారు. సారే జహాసే అచ్చా గీతాన్ని నేపథ్యంగా జోడించి ఈ వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.