'ఓపీఎస్ అమలు చేయాలి' - సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగుల ర్యాలీ
🎬 Watch Now: Feature Video
CPS Employees Rally: పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశమైంది. అనంతరం ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సీఎస్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ అమలు చేయలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చి మర్చిపోయారని ఉద్యోగులు తమ ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు కూడా ఎలాంటి ఆందోళనలు చేయకపోతే ప్రభుత్వం ఎప్పటికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని తీర్మానించారు.