కరవుపై స్పందించని సీఎం, మంత్రిమండలి ప్రజలకు అవసరమా?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ - CPI Ramakrishna news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 5:04 PM IST
CPI Ramakrishna Harsh Comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దారుణమైన కరవు పరిస్థితులు ఉంటే, ఏపీలో కరవు తీవ్రత తక్కువగా ఉందని సీఎం జగన్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి రైతుల సమస్యలు పట్టవా..? కరవు ప్రాంతాల్లో పర్యటించే తీరిక లేదా..? అని నిలదీశారు. కరవుపై ఈ నెల 20, 21 తేదీలలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నామని రామకృష్ణ వెల్లడించారు.
Ramakrishna Comments: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే 30 గంటల నిరసన దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ..''రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల కారణంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని గ్రామాలు వలస పోతున్నాయి. లక్షల ఎకరాల్లో రైతులు ఎటువంటి పంటలు సాగు చేయలేదు. ఆయకట్టు ప్రాంతాల్లో సైతం కరవు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతుల సమస్యలు, కరవు గురించి చర్చించని ఈ సీఎం, మంత్రిమండలి ప్రజలకు అవసరమా..? మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి రైతుల సమస్యలు పట్టవా..? రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి రైతుల గోడు వినే తీరిక లేదా..? ఈ నెల 20, 21 తేదీలలో 30 గంటల పాటు విజయవాడలో నిరసన దీక్ష చేపట్టబోతున్నాం'' అని ఆయన తెలిపారు.