Contract Lecturers Protest: నంద్యాలలో ఒప్పంద అధ్యాపకుల నిరసన.. కలెక్టర్కు వినతిపత్రం - contract lecturers agitation in nandyala
🎬 Watch Now: Feature Video
Contract Lecturers Protest in Nandyal: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో కటాఫ్ తేదీని సడలించాలని నంద్యాలలో ఒప్పంద అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మనజీర్ జీలానీ సమూన్ను కలిసి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. కన్నీటి వేడుకోలు పేరిట వారంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయంలో 2014 జూన్ 2 వరకు ఐదేళ్లు పనిచేసి ఉండాలన్న నిబంధన విధించడంతో తామంతా అర్హత కోల్పోతున్నామన్నారు. అందరికి రెగ్యులర్ అవుతుందని ఆశపడిన తమకు నిరాశే ఎదురయిందని ఒప్పంద అధ్యాపకులు అన్నారు. తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు విన్నవించుకున్నారు.
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ 2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలన్న షరతు పెట్టడం వల్ల చాలామంది ఒప్పంద ఉద్యోగులు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది.