Congress Leader Thulasi Reddy on Sunna Vaddi Funds: 'పావు కోడికి.. ముప్పావు మసాలా'.. వైఎస్సార్​ సున్నా వడ్డీ పథకంపై తులసిరెడ్డి విమర్శలు - Congress Leader Thulasi Reddy on Sunna Vaddi Funds

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2023, 1:40 PM IST

Congress Leader Thulasi Reddy on Sunna Vaddi Funds: వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వ వైఖరి.. పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లు ఉందని  కడపలో ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ(APCC) మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు అందిస్తున్న వైఎస్సార్​ సున్నా వడ్డీ పథకం గురించి అనేక పేపర్లలో, టీవీలలో అడ్వటైజ్మెంట్ ఇచ్చి.. కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని దుయ్యబట్టారు. ఇది కొత్త పథకం కాదని.. పాత పథకమని  స్పష్టం చేశారు. ఇది 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి 5 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ పథకం అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ జగన్ ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకే అమలు చేస్తోందని విమర్శించారు. కోట్ల రూపాయలను ప్రచార కోసం ఖర్చు చేస్తూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకాన్ని 7 లక్షల రూపాయల వరకు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తులసి రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.