CM Jagan Visit to Flood Affected Areas: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన.. ఆగమేఘాల మీద ఏర్పాట్లు - సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
🎬 Watch Now: Feature Video
CM Jagan Visit to Flood Affected Areas: కోనసీమ జిల్లా వరద ప్రభావిత గ్రామాల్లో సోమవారం ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారనే సమాచారంతో అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. గురజాపులంక గ్రామంలో నివాస గృహాల సమీపంలో నదీకోతను పరిశీలించటం.. ఆయా గ్రామాల్లో వరద బాధితులతో మాట్లాడనున్నారని అందుకు తగిన విధంగా గ్రామాల్లో పరిస్థితులు కల్పిస్తున్నారు. గురజాపులంకలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం వరద ముంపునకు గురైన జిల్లాలకు సంబంధించి సీఎం.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో.. నేను వచ్చి పరిశీలించేటప్పుడు ఏ ఒక్క బాధితుడు నాకు సహాయం అందలేదని చెప్పకూడదని.. మా కలెక్టర్, ఇతర అధికారులు మమ్ములను ఆదుకోలేదనే మాట వినిపించకూడదని సీఎం హెచ్చరించారని తెలుస్తోంది. దీంతో వరద సమయంలో బాధితులను పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. బాధితులకు డబ్బులతో పాటు బియ్యం, కందిపప్పు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. సోమవారం గోదావరి వరద పీడిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, అల్లూరి జిల్లా కూనవరంలో సీఎం పర్యటన ఖరారు అయింది.
TAGGED:
CM TOUR