జిందాల్ కర్మాగారం వద్ద సెక్యూరిటీ-లారీ డ్రైవర్ల మధ్య ఘర్షణ - ఆలస్యంగా వెలుగులోకి - జిందాల్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ లారీ డ్రైవర్లు ఘర్షణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 10:20 PM IST
Clash at Jindal Factory Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం హారే సముద్రం పంచాయతీ పరిధిలోని జిందాల్ కర్మాగారం వద్ద లారీ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం లారీల లోడింగ్ కోసం క్యూలో పెట్టే విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో.. కర్మాగారం యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. పోలీసుల సమక్షంలోనే లారీ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది భౌతిక దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
అనంతరం పోలీసులు నచ్చజెప్పి లారీ డ్రైవర్లను కర్మాగారం నుంచి బయటకు పంపించారు. క్యూలో రమ్మని చెప్పినందున తమపై దాడులకు పాల్పడ్డారని సెక్యూరిటీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ల సంఘం తరఫున కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై బొమ్మనహాల్ ఎస్సై శివ మాట్లాడుతూ ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఇరువర్గాల వారిని చెదరగొట్టి సర్దిచెప్పి పంపామని చెప్పారు. ఇరువర్గాల నుంచి తమకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.