Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
Chinna Kottai Festival in Srikalahasti Temple: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పగడ చెట్టు వద్దకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వివిధ రంగల పుష్పాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మ వార్లను భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ఈవోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ నెల 5వ తేదీ వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలను నిర్వహించనున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారంతో పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.