Changes In GPS Bill జీపీఎస్ బిల్లులో మళ్లీ మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... - బిల్లులో మార్పు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 7:55 PM IST
Changes In GPS Bill: జీపీఎస్ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మార్పు చేర్పులు చేసింది. కేబినెట్లో ఆమోదించిన బిల్లులో తలెత్తిన లోపాలను సవరిస్తూ మరోమారు ప్రభుత్వం కేబినెట్ ఆమోదానికి ఉంచింది. అత్యవసరంగా మంత్రులకు ఇ-ఫైల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులేట్ చేసింది. జీపీఎస్ లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్ పై సందిగ్ధత ను తొలగిస్తూ... నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదన సిద్ధం చేసినట్టు సమాచారం. ఉద్యోగి యాన్యుటీ తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే టాప్ అప్ సరిపోని పక్షంలో ఫ్యామిలీ పెన్షన్, మినిమమ్ పెన్షన్ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పు చేర్పులు చేసింది. జీపీఎస్ బిల్లు కొత్త ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పంపాలని మంత్రులకు సూచనలు ఇచ్చింది. సీపీఎస్ లో ఉన్న ఉద్యోగులు అందులోనే కొనసాగేందుకు నిర్దేశిత గడువు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఉద్యోగికి ఇచ్చిన సమయంలో దానిపై సమాధానం ఇవ్వకపోతే జీపీఎస్ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించినట్టు సమాచారం. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ 2023 బిల్లును రేపు శాసనసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.