ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 8 టన్నుల క్యాట్ ఫిష్ పట్టివేత! మీసాలు పీకేసి - కొరమీనుగా అమ్మేస్తున్నట్లు గుర్తింపు - Banned Cat Fish caught in nellore
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 10:47 AM IST
8Tones of Cat Fish Caught in Nellore ఆరోగ్యానికి హానికరమైన నిషేధిత క్యాట్ ఫిష్(Cat Fish)ను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పట్టుకున్నారు. క్యాట్ ఫిష్‌ను స్వాధీనం చేసుకున్న ఆధికారులు వీటి విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
Officials Estimate Value of Cat Fish is Rs.8 Lakh Rupees: నెల్లూరు జిల్లా రూరల్ మండలం ద్వారకా నగర్‌లో క్యాట్ ఫిష్‌ను అక్రమంగా లారీలో ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు 8 టన్నుల క్యాట్ ఫిష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాట్ ఫిష్ విలువ రూ.8 లక్షల రూపాయిలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పట్టుకున్న క్యాట్ ఫిష్‌ను.. పెన్నా నదిలో మత్స్య, రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో పూడ్చి వేశారు. అక్రమంగా క్యాట్ ఫిష్‌ను సాగు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Cat Fish on Banned List: క్యాట్ ఫిష్ ఇది కుళ్లిన మాంసాన్ని,వ్యర్థాలను తిని పెరిగే ఈ చేప విషపూరితంగా మారుతుంది. అందుకే సుప్రీం కోర్టు(supreme court banned) దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. ఇది కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల వరకూ బరువు పెరుగుతుందట. చేపలలో బాగా డిమాండ్ ఉండే కొరమేనును పోలి ఉండే ఈ చేపను మీసాలు పీకేసి కొరమేను పేరుతో ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు.ఈ చేపను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు,క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కరోనా సమయంలో రోగనిరోధక వ్యవస్థను పెంపోందించుకునేందుకు చేపలు తినాలని వైద్యులు సూచించగా ఇలా కొరమేను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు.