Cat Fights Snake In Anantapur రోడ్డుపై పాము పిల్లి పోరాటం... గెలుపెవరిదంటే? - పామును ఓ పిల్లి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 10:59 PM IST
Cat Fights Snake In Anantapur: మనం తరచూ పాము, ముంగిస పోరాటాలు చూస్తూ ఉంటాం... ఆ పోరాటాల్లో చివరకు పాము (snake) లేదా ముంగిస గెలుస్తోంది... లేదా పోరాడలేక అక్కడి నుంచి రెండు పరారవుతాయి. కానీ ఇక్కడ పామును ఓ పిల్లి (cat) చంపిన వీడియో ప్రస్థుతం సోషల్ మీడియాలో వైరల్గా ఘటన అనంతపురం (Anantapur) జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద పిల్లి, ఓ పాము పోట్లాడటం ఆసక్తిగా సాగింది. దాదాపు అరగంట పాటు పిల్లి, ఆ పామును అటు ఇటు కదలనియకుండా తన కాళ్లతో కొడుతూ గాయపరిచింది. పాము పిల్లి పైకి తిరగబడుతూ దానినుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ పిల్లి తన కాళ్లతో పామును చంపేసింది. ఈ సన్నివేశాన్ని అటుగా వెళుతున్న వాహనదారులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.