Blown Slab Cracks in College: ఊడిపడిన తరగతి గది శ్లాబ్ పెచ్చులు.. తప్పిన ప్రమాదం - ap news
🎬 Watch Now: Feature Video

Blown Slab Cracks in Government Degree College Classroom : ప్రభుత్వం, అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాతబడిన బిల్డింగ్‌లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. తాజాగా ఓ డిగ్రీ కళాశాల తరగతి గదిలో శ్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఉండగానే శ్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. అప్రమత్తమైన విద్యార్థులంతా ఒకవైపునకు వచ్చేశారు. పైనుంచి పడిన పెచ్చులన్నీ బెంచీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్లాబ్ పెచ్చులు ఊడటం తగ్గిన తర్వాత విద్యార్థులు క్లాస్ రూమ్‌ను శుభ్రం చేసుకున్నారు.
ప్రభుత్వాలు డిగ్రీ కళాశాలలపై దృష్టి పెట్టడం లేదని.. దీంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఐసు బాబు చెప్పాడు. వర్షం కారణంగా రెండు రోజులుగా గోడలు తడిసి ఉన్నాయని,.. శ్లాబ్ పెచ్చులు ఊడటంతో విద్యార్థులు భయంతో క్లాసుల్లో కూర్చుంటున్నారని ఆయన ఆరోపించారు. పెను ప్రమాదం తప్పిందని, ఒకేసారి గోడ కూలితే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నూతన డిగ్రీ తరగతి గదులు నిర్మించాలని ఐసు బాబు డిమాండ్ చేశారు.