Sunil Deodhar on Kodali Nani: 'కొడాలి నాని అసెంబ్లీ గడప తొక్కకుండా తీర్పు ఇవ్వండి' - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 17, 2023, 5:41 PM IST

BJP leader comments on Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని క్యాసినో, క్యాబరే డ్యాన్సులు నిర్వహిస్తూ గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్‌ మండిపడ్డారు. కృష్ణా జిల్లా.. గుడివాడ నియోజకవర్గం సమస్యలపై నిర్వహించిన బీజేపీ చార్జ్​షీట్ కార్యక్రమంలో సునీల్ దియోధర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను సైతం క్యాసినో, క్యాబరే డ్యాన్స్​లుగా మార్చేశారని విమర్శించారు.. కొడాలి నాని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ఎన్నికలలో తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు గజ దొంగలని.. వారికి రాజు జగన్‌ అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని అన్నారు.. కొడాలి నాని బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని, అలాంటి ఎమ్మెల్యేల కారణంగా ఏపీ పరువు సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గుడివాడ సమస్యలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఛార్జ్ షీట్ ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.