BCY Cheif Ramachandra Yadav On YSRCP: 'వైసీపీ అరాచకాలకు ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉంది' - బీసీవై పార్టీ రామచంద్రయాదవ్
🎬 Watch Now: Feature Video
BCY Cheif Ramachandra Yadav On YSRCP: వైసీపీ చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారి తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను వైసీపీ నాయకులు తీవ్రంగా హింసిస్తున్నారని.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ పార్టీ వైపే చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ సంచలనాలు నమోదు చేస్తుందని తెలిపారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలు ఇంకా ఎనిమిది నెలల వరకే అని మండిపడ్డారు. బీసీవై పార్టీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తోందని.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.