Bear In Village బాబోయ్​ ఎలుగుబంటి! ఊరిమధ్యలో చెట్టెక్కి కూర్చున్న భల్లూకం.. గ్రామస్థులకు ముచ్చెమటలు! - చెట్టుపై ఎలుగుబంటి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2023, 1:18 PM IST

Bear In Siddavatam: కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. అడవిని వీడి గ్రామంలోకి చేరిన ఆ ఎలుగుబంటిని చూసి ప్రజలు హడలెత్తిపోయారు. గ్రామంలో తిరిగిన ఆ భల్లూకం ఊరి మధ్యలోని చెట్టెక్కి కూర్చోని.. అక్కడే కూర్చుండిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దాన్ని బంధించి అడవిలోకి తరలించటానికి నానా హైరానా పడ్డారు.

జిల్లాలోని సిద్ధవటం ప్రధాన రహదారి సమీపాన ఊరిమధ్యలో.. బుధవారం తెల్లవారుజామున ఓ ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దానిని చూసిన స్థానికులు బెంబేలెత్తిపోయారు. ప్రజలను చూసి హడలెత్తిన ఆ ఎలుగుబంటి చెట్టెక్కి కూర్చుంది. దీంతో ప్రజలు దానిని చెట్టు నుంచి దింపేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎంతకీ చెట్టు దిగకపోవటంతో అటవీశాఖ అధికారులకు తెలియజేయటంతో వారు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించటానికి చర్యలు చేపట్టారు. పోలీసుల అనుమతితో అటువైపుగా గ్రామస్థులను ఎవర్ని రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ లోపు ఆ ఎలుగుబంటి చెట్టు పై కొమ్మల వరకు ఎక్కి అక్కడే ఎటు కదలకుండా కూర్చుండిపోయింది. దీంతో అటవిశాఖ సిబ్బందికి దానిని చెట్టుమీద నుంచి కిందకి దింపడం కాస్త ఇబ్బందిగా మారింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.