'ఉచితంగా ఇసుక ఇచ్చారని చంద్రబాబుపై కేసు - ఉచితంగా బియ్యం ఇచ్చినందుకు మోదీపైనా కేసు పెడతారా?' - Bandaru Satyanarayana news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 12:17 PM IST
Bandaru Satyanarayana Comments on Chandrababu Sand Case : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇసుక కుంభకోణం కేసు పెట్టిన సీఎం జగన్ (CM Jagan), ఉచిత బియ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi)పై కేసు పెట్టగలరా అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నిలదీశారు. విజయనగరం మయూర హోటల్ లో "జగన్ పాలనలో బీసీలపై దాడులు-ప్రభుత్వ వైఫల్యాలు" పై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం (Round Table Conference) నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బండారు సత్యనారాయణ హాజరయ్యారు.
Cases on Chandrababu Naidu : ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని.. ఇప్పటి వరకూ నమోదు చేసిన ఏ ఒక్క కేసులోను ఆధారం లేదని బండారు సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం తమ నాయకులపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఏ ఒక్క కేసులో కూడా ఆధారాలు లేవని ఆయన అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే., జగన్ మీద రోజుకు ఒక కేసుతో జీవితాంతం జైళ్లో పెడతామని పేర్కొన్నారు.
TDP Leader Bandaru Satyanarayana Fire on YSRCP Government : వైఎసార్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అనినీతికి పాల్పడుతోందని బండారు ఆరోపించారు. ఇసుక నుంచి., సాగునీటి ప్రాజెక్ట్ లు బినామీలకు కట్టబెట్టం, ఇంటి స్థలాలు, విద్యుత్తు మీటర్ల కొనుగోళ్లు, మద్యం... ఇలా అన్ని రంగాల్లోనూ కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. ఎన్నికలు సమయం దగ్గర పడిందని.. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని సుపరిపాలన చేయాలని ఆయన సూచించారు.