Balagam Ilayya: చాలా మంది తర్వాత.. నాకు అవకాశమొచ్చింది: కోట జయరాం - బలగం సినిమా కోట జయరామ్ ఇంటర్వ్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2023, 12:49 PM IST

Updated : May 21, 2023, 1:13 PM IST

Balagam Movie Fame Kota Jayaram: మానవ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన "బలగం" సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రంలో కొమరయ్య పెద్ద కుమారుడు ఐలయ్య పాత్రలో జీవించి.. ప్రేక్షకులతో కంటతడి పెట్టించి అందరి మన్ననలను అందుకున్న నటుడు కోట జయరాం బాపట్ల జిల్లా చీరాల వాసి. నటుడిగా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు లభించిందని.. ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చిందని ఆయన తెలిపారు. 

సినిమాలలోకి రావాలని నటనలో శిక్షణ తీసుకున్నానని.. తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించానని జయరాం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నానని అన్నారు. బలగం సినిమాలో తెలంగాణ యాసపై పట్టుసాధించడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. బలగం డైరెక్టర్ వేణు.. ఐలయ్య పాత్రకోసం అనేక మందిని పరీక్షించారని.. నటన, భాషా కలవకపోవటంతో చాలామందిని తిరస్కరించారని అన్నారు. తరువాత తనకు ఆడిషన్స్ నిర్వహించారని తన నటన వేణును ఆకట్టుకోవటంతో.. తనకు బలగం సినిమాలో అవకాశం లభించిందన్నారు. బలగం సినిమా ఘన విజయం పొందటంతో ఆయన చీరాల వచ్చి తన ఆనందాన్ని, అనుభవాలను ఈటీవీ-భారత్​తో పంచుకున్నారు. 

Last Updated : May 21, 2023, 1:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.