చంద్రబాబు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా నా కుమారుడు విజయ్: అయ్యన్నపాత్రుడు - Ayyannapatrudu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 15, 2024, 12:39 PM IST
Ayyannapatrudu Comments : యుగ పురుషుడు ఎన్టీఆర్ తీర్థం నిర్వహించిన నిర్వాహకులను మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అభినందించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తీడ గ్రామంలో ఏటా నిర్వహించే ఎన్టీఆర్ తీర్థ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా భోగి రోజు ఎన్టీఆర్ తీర్థం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలో భారీ అన్న సమారాధ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మరో వంద రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రానుందని, ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వస్తుందని తెలిపారు. తన కుమారుడు చింతకాయల విజయ్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నాడని, చంద్రబాబు నాయుడు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా తన కుమారుడు పోటీ చేస్తాడని అయ్యన్నపాత్రుడు తెలిపారు. తన కుమారుడికి ఎంపీ సీటు వస్తే తనను ఎలా ఆదరించారో తన కుమారుడిని అలాగే ఆదరించాలని కోరారు.