ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ప్రధానోపాధ్యాయుడు మృతి : ఏపీటీఎఫ్ - పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వ అధికారులు వేధింపుల
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 12:41 PM IST
Associations Protest Against Teacher's Death : విజయనగరం జిల్లాలో కాగితాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంప సుధాకర్ మృతికి డీఈఓ, డిప్యూటీ డీఈఓ వేధింపులే కారణమని ఉపాధ్యాయులు నల్ల జెండాలు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. రాజాం అంబేడ్కర్ కూడలి నుంచి బొబ్బిలి జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు.
Demand to Take Action Against Those Responsible for the Death : పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వ అధికారులు వేధింపులకు గురిచేయడం వల్లనే సుధాకర్ మరణించాడని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ మృతికి కారణమైన డీఈఓ, డిప్యూటీ డీఈఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధాకర్ మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. అధికారుల వేధింపుల కారణంగానే సుధాకర్ మానసికంగా కుంగిపోయి గుండె పోటుతో మృతి చెందాడని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.