Jsp vs YSRCP: వైసీపీ ఎమ్మెల్యేపై.. జనసేన కార్యకర్త పోస్ట్! తీసేయాలన్న పోలీసులు.. ససేమిరా అన్న జనసైనికులు! - తెలుగు ప్రధాన వార్తలు
🎬 Watch Now: Feature Video
Social media war in between JSP and YSRCP వైస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టు.. పోలీస్ స్టేషన్ వేదికగా ఉద్రిక్తతకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వీరవాసరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశారు. జనసేన కార్యకర్త పెట్టిన ఆ పోస్టు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ను కించపరిచేలా ఉందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆ పోస్టుపై వీరవాసరం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పోస్టు పెట్టిన సదరు జనసేన కార్యకర్తను స్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టును తొలగించాలని జనసేన కార్యకర్తను పోలీసులు కోరారు. పోస్టును తొలగించేందుకు జనసేన కార్యకర్త నిరాకరించటంతో పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల వాగ్వాదంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు వీరవాసరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కుతుందని గ్రహించిన పోలీసులు.. ఇరు వర్గాలతో మాట్లాడి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.