APSRTC NMU Leaders Letter to Central PF Commissioner: బకాయి చెల్లించని ప్రభుత్వం.. హయ్యర్ పెన్షన్‌ను కోల్పోవాల్సిన పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు - ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 12:17 PM IST
APSRTC NMU Leaders Letter to Central PF Commissioner: ఆర్టీసీ ఉద్యోగులు హయ్యర్ పెన్షన్‌కు నగదు చెల్లించే గడువు మరో 3 నెలలు పొడిగించాలని ఎన్ఎంయూ కోరింది. న్యూదిల్లీలోని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (Central Provident Fund Commissioner) నీలం షామిరావును.. ఆర్టీసీ ఎన్ఎంయూ (National Mazdoor Union) నేతలు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు లేఖ రాశారు. సెప్టెంబర్‌లో 2 వేల మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ కోసం నగదు చెల్లించేందుకు డిమాండ్ నోటీసులు అందాయని, సెప్టెంబర్ నెలాఖరులోపు హయ్యర్ పెన్షన్ కోసం నిర్ణీత మొత్తం చెల్లించాలని నోటీసుల్లో.. పీఎఫ్ ట్రస్ట్ తెలిపిందని లేఖలో నేతలు తెలిపారు. గడువులోపు కేవలం 15 వందల మంది ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే హయ్యర్ పెన్షన్ కోసం నగదు చెల్లించారని, నోటీసులు తీసుకున్న వారిలో 500 మంది ఉద్యోగులు డబ్బు లేక హయ్యర్ పెన్షన్‌కు దరఖాస్తు చేయలేకపోయారని కమిషనర్‌కు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఉద్యోగులకు బకాయిలు రావాల్సి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. 2017 వేతన సవరణ, ఎస్బీటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ల బకాయిలు రావాల్సి ఉందని.. NMU నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు బకాయిలు ఉద్యోగులకు రావాల్సి ఉందన్నారు. బకాయిలు విడుదల చేయని పరిస్థితుల్లో ఉద్యోగులు హయ్యర్ పెన్షన్‌ను కోల్పోవాల్సిన దుస్ధితి వస్తోందని లేఖలో పీఎఫ్ కమిషనర్‌కు తెలిపారు. ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తే ఉద్యోగులు నగదు చెల్లిస్తారని తెలిపారు. పరిస్ధితి అర్ధం చేసుకుని హయ్యర్ పెన్షన్‌కు నగదు చెల్లించాల్సిన గడువు మరో 3 నెలలు పెంచాలని, తద్వారా ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ పొందేలా అవకాశం కల్పించాలని కమిషనర్‌ను ఎన్ఎంయూ నేతలు కోరారు.