APSRTC Door Delivery Monthly Celebrations: అక్టోబర్ 26నుంచి ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరి మాసోత్సవాలు - RTC Parcel Courier Service
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 10:39 PM IST
APSRTC Door Delivery Monthly Celebrations: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ "డోర్ డెలివరి” మాసోత్సవాలను నిర్వహిస్తోంది. అక్టోబర్ 26వ తేది నుంచి నవంబర్ 25వరకు ఆర్టీసీ నిర్వహిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. ఆర్టీసీ ద్వారా పార్శిల్, కొరియర్ డెలివరిలను ప్రొత్సహించేందుకు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆర్టీసీ తెలిపింది. సామాన్యులు సైతం వెచ్చించె స్థాయిలో ధరలను నిర్ణయించినట్లు ఆర్టీసీ వివరించింది. పార్శిల్, కొరియర్ వంటి వాటిని ఆర్టీసీ ఇకపై డోర్ డెలివరి చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రంలోని 84 ప్రధాన నగరాలతోపాటు పట్టణాల్లో వేగంగా.. విస్తృతంగా డోర్ డెలివరి సేవలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా డోర్ డెలివరి వ్యవస్థను విస్తృతం చేయటానికే.. ఈ “డోర్ డెలివరి” మాసోత్సవములను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. ఈ సేవలను హైదరాబాద్‌లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. అందుకు హైదరాబాద్ నగర పౌరులు తమ పార్శిల్, కోరియర్లను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలనుకుంటే.. ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ అధికృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది. పార్శిల్, కొరియర్ డోర్ డెలివరి ఛార్జీలను ఆర్టీసీ ఒక కేజీ వరకు 18 రూపాయలు వసూలు చేయనున్నట్లు వివరించింది. 6 కేజీల వరకు 30 రూపాయలని.. 10 కిలోల వరకు 36 రూపాయలు, 25కిలోల వరకు 48 రూపాయలు, 25 నుంచి 50 కిలోల వరకు 59రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వివరించింది.