APPSC Group1 Top Rankers Interview: గ్రూప్-1 టాప్ ర్యాంకర్స్.. కల నెరవేర్చుకున్నారిలా..! - Andhra Pradesh Public Service Commission
🎬 Watch Now: Feature Video
APPSC Group1 Top Rankers Interview : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే గ్రూప్-1 తుది ఫలితాలు రానేవచ్చాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్-1 సాధించడమే లక్ష్యంగా ఏళ్లు తరబడి ప్రిపేరై.. అహోరాత్రులు శ్రమించిన ఎంతోమంది కల.. ఫలితాల రాకతో నెరవేరినట్లైంది. గ్రూప్-1 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పలువురు అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదల.. నిరంతర సాధన ఫలితంగానే ఈ ర్యాంకులు సాధించామని చెబుతున్నారు. అయితే ఇందులో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకెళ్లింది కొందరైతే.. అధికారులను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యం వైపు అడుగులు వేసింది మరికొందరు. ఇలా గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మరి, ఈ ర్యాంకులను సాధించటానికి ఆ ర్యాంకర్లు ఏ విధంగా కష్టపడ్డారు..? తమ ప్రిపరేషన్ ఎలా కొనసాగించారు..? భవిష్యత్ తరాల వారికి ఎలాంటి సూచనలను ఇస్తారనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి..