APPSC Group 1 Second Ranker Pavani Interview: వరుస ఓటములను తట్టుకుని గ్రూప్​1లో రెండో ర్యాంక్ సాధించిన పావని.. - ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ పావని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2023, 1:38 PM IST

APPSC Group 1 Second Ranker Pavani Interview: వరుస ఓటములు.. వాటన్నింటినీ తట్టుకొని నిలబడి మళ్లీ సిద్ధమవడం అంత సలువు కాదు. కానీ పట్టుదల ఉంటే సాధించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించారు ఆ గ్రూప్‌ 1 విజేత. పోటీ పరీక్షల్లో పలుమార్లు విఫలమైనా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఆమె ముందుకు కదిలారు. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా తట్టుకుని నిలబడ్డారు. నాలుగో ప్రయత్నంలో గ్రూప్ 1 ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించి సత్తా చాటారు వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన భూమిరెడ్డి పావని. ఆమె డిప్యూటీ కలెక్టర్​గా ఎంపికయ్యారు. ఓటములను తన విజయానికి మెట్లుగా చేసుకుంటూ ముందుకు సాగి ఔరా అనిపించుకుంటున్నారు. మరి ఈ పోటీ పరీక్షల ప్రయాణం ఎలా సాగిందో తెలుసా..? ఈ విజయం కోసం పావని అనుసరించిన విధానం ఏమిటి..? గ్రూప్స్​కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తను చెప్పే సలహాలు ఏమిటి.? ఇలా అనేక విషయాలను ఆమె పంచుకున్నారు. అవన్నీ మీ కోసం.. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.