AP Govt MOU on IB Syllabus పాఠశాల విద్యలో ఐబీ సిలబస్ కోసం ఇంటర్ నేషనల్ బాక్యులరెట్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 10:40 PM IST

AP Govt MOU on IB Syllabus ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు.. ఇంటర్ నేషనల్ బాక్యులరెట్ సంస్థతో నేడు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సిలబస్‍‌ను అమలు చేయనున్నామన్నారు. కేబినేట్ సమావేశంలో మంత్రివర్గం అనుమతి మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నామని అధికారులు తెలిపారు.

State Cabinet Approves IB Syllabus: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఐబీ సంస్థతో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సింగపూర్‌, వాషింగ్టన్‌ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐబీ ప్రతినిధులు పాల్గొని.. సిలబస్‌పై జగన్‌తో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అధికారులు సిలబస్‌పై ఒప్పందం చేసుకున్నారు.

CM Jagan Comments: సీఎం జగన్ మాట్లాడుతూ.. ''ఐబీ సిలబస్ విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.'' అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.