AP Governor Justice Abdul Nazeer AT HOME Program: రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు - abdul nazeer at home program in raj bhavan
🎬 Watch Now: Feature Video

AP Governor Justice Abdul Nazeer AT HOME Program: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రముఖులు ఈ తేనేటి విందులో పాల్గొన్నారు. అందరినీ గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ పర్యటన కారణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.