AP Air Travellers Association on Vishaka Night Flight Services విశాఖలో నైట్ ల్యాండింగ్ మూసివేతపై ఎయిర్ ట్రావెల్ కంపెనీల ఆందోళన! - విశాఖ విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ మూసివేత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2023, 5:14 PM IST

AP Air Travellers Association on Vishaka Night Flight Services Stopped: విశాఖ విమానాశ్రయంలో నవంబర్ 15 నుంచి నైట్ ల్యాండింగ్ మూసివేస్తున్నట్టు నేవీ అధికారులు ప్రకటించిన సమయాల్లో మార్పులు చేయాలని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కోరింది. రన్ వే నిర్వహణ కోసం నైట్ ల్యాండింగ్​ను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని నేవీ అధికారులు నిర్ణయించారు. నేవీ తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖపట్నం విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణమోహన్ తెలిపారు. నైట్ లాండింగ్ మూసివేత నిర్ణయంతో 12 విమానాలు రన్​వేకే పరిమితమవుతాయని అన్నారు. నైట్ ల్యాండింగ్ మూసివేత నిర్ణయంతో డిసెంబర్ 13 నుంచి 16 వరకు జరిగే అంతర్జాతీయ సర్జన్ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నైట్ ల్యాండింగ్ మూసివేత సమయాన్ని రాత్రి 10:30 నుంచి ఉదయం 6:30 గంటల వరకు కుదించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.