సీఎం జగన్ దయవల్లే నూతన సంవత్సర తొలిరోజు రోడ్డుపై ఉన్నాం: అంగన్వాడీ సంఘాల నేతలు
🎬 Watch Now: Feature Video
Anganwadi Leaders Comments on CM Jagan: నూతన సంవత్సరం మొదటి రోజున కూడా అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అంగన్వాడీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 రోజులుగా పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రికి కనికరం కలగడం లేదా అని నిలదీశారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్పా సమస్యలు పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. ఎల్లుండిలోగా హామీలు నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. జనవరి 3న కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీలు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రాట్యుటీ గురించి కేంద్రం వద్ద తేల్చుకోవాలని అనడం సరికాదని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలకు జులై నుంచి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు డిమాండ్ల గురించే మాట్లడుతున్నారని, మిగతా డిమాండ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమకు ఫోన్లు అందించిన తర్వాత మరింత పనిభారం పెరిగిందని వాపోయారు.