Govt teacher praises CM: ఎమ్మెల్యే, సీఎంపై ఉపాధ్యాయుడు పొగడ్తలు.. అసహనం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు - Govt Boys School telugu teacher praised the CM
🎬 Watch Now: Feature Video
Govt Boys High School telugu teacher praised the CM: కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి పరిచయకర్తగా వ్యవహరించిన రాజా జయచంద్ర సుమారు 20 నిమిషాలపాటు.. ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తుతూ.. ముఖ్యమంత్రినీ కొనియాడటం సంచలనంగా మారింది. ''ప్రజా పరిపాలనలో మహామేటి.. ప్రజాసేవలో ఎవరు.. ఆమెకు పోటీ అనన్య సామాన్యం, ఆమోఘం ఆమె వాగ్ధాటి, ఆమె శ్రీదేవి కంగాటి. జై జగనన్నా.. జైజై శ్రీదేవమ్మక్క.'' అంటూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్న రాజా జయచంద్ర.. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై రాసిన కవిత జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న సిలబస్‌ను బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. సుమారు 20 నిమిషాలపాటు ఎమ్మెల్యేను, ముఖ్యమంత్రి జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ.. ప్రసంగించిన వైనాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. అంతటితో ఆగకుండా విద్యార్థులతో సైతం జై జగనన్నా.. జై కంగాటి శ్రీదేవమ్మా అనే నినాదాలను వల్లెవేయించారు. దీంతో అక్కడున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారడంతో ఉపాధ్యాయుడుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.