Whip Kapu Ramachandra reddy ప్రజలు లేరు.. గడపగడపకు ఎలా నిర్వహించేది ? కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఎమ్మెల్యే! - Bommanahal Mandal Gounur
🎬 Watch Now: Feature Video
Lack of Response to Gadapa Gadapaku mana prabhutvam program: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆదివారం బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన కొరవడింది. సర్పంచ్ ముల్లంగి భారతి, ఎంపీటీసీ ముల్లంగి నాగమణిలు లేకుండా ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని చేపట్టగా.. గ్రామంలోని ప్రజలు, రైతులు ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లారు. దీంతో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి క్షణాల్లో గడప గడప ముగించుకొని ఉప్పరహాల్ కు బయలు దేరి వెళ్లిపోయారు. ఉప్పర హాల్ గ్రామంలో కూడా ప్రజలు లేకపోవడంతో గడప గడప కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఎప్పుడు నిర్వహించేది తేదీ ప్రకటిస్తామన్నారు. బొమ్మనహాల్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీల్లో రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇటీవల నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సాదాసీదాగా ముగిస్తున్నారు. ఎమ్మెల్యే స్వయంగా నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తుపోతున్నారు.