రోడ్డుపై చెల్లాచెదురైన గ్యాస్ సిలిండర్లు - అదృష్టం కొద్దీ బయటపడ్డారు! - ప్రకాశం జిల్లా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 1:07 PM IST
A Sand Lorry Collided with Gas Cylinder Lorry : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. కడప నుంచి కనిగిరికి వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల వాహనాన్ని.. అదే మార్గంలో నెల్లూరు నుంచి ఇసుక లోడ్ తో వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీ కొని పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్ల రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాద సమయంలో అటుగా వెళ్తుతున్న ప్రయాణికులు, వాహనదారులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఒక్క సిలిండర్ కూడా లీక్ కాకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. రోడ్లుపై చెల్లాచెదురుగా పడిన గ్యాస్ సిలిండర్లను తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు.