చిత్రావతి నదిలో కొట్టుకుపోయిన ఆటో.. డ్రైవర్ గల్లంతు - chitravati river full water
🎬 Watch Now: Feature Video
Auto Washed away.. Driver missing: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది కాజ్‌వే పైనుంచి ప్రయాణిస్తున్న ఆటో నదిలో కొట్టుకుపోయి దివ్యాంగుడైన డ్రైవర్ గల్లంతయ్యారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని చిత్రావతి నదిపై నిర్మించిన పరగోడు డ్యాం నిండి పొంగి ప్రవహిస్తోంది. దానివల్ల శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. సుబ్బరావుపేట వద్ద నదిపై నిర్మించిన కాజ్‌వేపై నీరు ప్రవహిస్తోంది. ప్రవాహం తక్కువ ఉందని భావించి డ్రైవర్ శంకరప్ప (40) తన వాహనంలో కాజ్‌వే దాటడానికి ఆదివారం ప్రయత్నించారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఆటోతో సహా కొట్టుకుపోయారు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులెవరూ లేరు. చాగలేరు పంచాయతీ శానగానపల్లివాసి శంకరప్ప ఆటో నడుపుతూ తల్లిదండ్రులను పోషిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST