ETV Bharat / sukhibhava

Milk Before Bed Is Good Or Bad : నిద్రపోయే ముందు పాలు తాగుతున్నారా? ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 8:00 AM IST

Milk Before Bed Is Good Or Bad : పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే చాలా మందికి ప‌డుకునే ముందు పాలు తాగ‌డం అలవాటుగా ఉంటుంది. అయితే.. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగితే మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Milk Health Benefits and disadvantages
Is It Safe To Drink Milk Before Sleep

Milk Before Bed Is Good Or Bad : పుట్టిన బిడ్డ మొదట తీసుకునే ఆహారం పాలు. అంటే మానవుల జీవితం పాలతోనే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి పాలు ఎంతో అవ‌స‌రం. ఇందులో కాల్షియం, విట‌మిన్ - డి లాంటి ముఖ్య‌మైన పోషకాలు ఉండ‌టం వల్ల ఎముక‌ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు తాగ‌డం వ‌ల్ల వివిధ వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాం. అందుకే రాత్రి పడుకునే ముందు చాలా మంది పాలు తాగుతూ ఉంటారు. అయితే ఇది అంత మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిద్రపోయే ముందు పాలు తాగితే!
Is It Safe To Drink Milk Before Sleep : పాల‌ల్లో ప్రోటీన్‌, లాక్టోజ్ ఉంటాయి. ఇవి నిద్ర‌కు ఆటంకం క‌లిగిస్తాయి. అందువల్ల కొంత మందికి రాత్రి పాలు తాగిన తరువాత సరిగ్గా నిద్ర ప‌ట్ట‌దు. రాత్రిపూట మ‌న శ‌రీరంలో స‌హ‌జంగా డీటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ జరుగుతుంది. దీనిపై పాల ప్ర‌భావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాత్రి పూట పాలు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ పాలు తాగితే.. కాలేయం ప‌నితీరు మంద‌గించే అవ‌కాశ‌ముంటుంది. అంతే కాకుండా, నిద్ర పోయే ముందు చ‌ల్ల‌టి పాలు అస్సలు తాగ‌కూడ‌దు. ఒక వేళ తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Milk Disadvantages : మీకు ఇప్ప‌టికే జీర్ణ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు, వ్యాధులు ఉంటే రాత్రి పూట పాలు తీసుకోవ‌డం మంచిది కాద‌ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, రాత్రి పూట పాలు తాగ‌డం వ‌ల్ల అవి మ‌న జీర్ణ‌క్రియకు అంత‌రాయం క‌లిగిస్తాయ‌ని వారు అంటున్నారు. జీర్ణక్రియ స‌క్రమంగా జ‌ర‌గ‌కుంటే.. రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణంకాక మ‌లబ‌ద్ద‌కం స‌మ‌స్య‌ ఉత్ప‌న్న‌మ‌వుతుంది. క్ర‌మంగా ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

బ‌రువు పెరుగుతారు
Milk Before Bed For Weight Gain : నిద్రపోయే ముందు పాలు తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం సైతం ఉంది. బ‌రువు పెర‌గ‌డంలో క్యాల‌రీలు కీలక పాత్ర పోషిస్తాయ‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. అవి త‌గినంత ఖ‌ర్చు కాన‌ప్పుడు కొవ్వు రూపంలో మ‌న శ‌రీరంలో పేరుకుపోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా బ‌రువు పెరుగుతాం. సాధార‌ణంగా ఒక గ్లాసు పాల‌ల్లో దాదాపు 120 క్యాల‌రీలు ఉంటాయి. మ‌నం నిద్రపోతున్న సమయంలో ఇవి క‌రిగే అవ‌కాశం తక్కువ. అందువల్ల బరువు తగ్గాలని కావాల‌నుకునే వారు రాత్రిపూట పాలు తీసుకోకపోవడం మంచిది. ఒక వేళ తీసుకుంటే క్యాల‌రీలు క‌రిగేలా ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

Milk Health Benefits : పాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల కచ్చితంగా ప్రతి ఒక్కరూ మంచి పాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. కానీ పాలు లాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకున్న తరువాత.. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాలి. సాధారణంగా రాత్రి మనం నిద్రపోతాం కనుక ఇలాంటి సమయంలో పాలు తీసుకుంటే.. దానిని జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. అందువల్ల రాత్రి పూట తీసుకునే ఆహారంలో.. పాలను చేర్చాలా? వద్దా? అనేది మీరే నిర్ణ‌యించుకోవాలి. మీ వ్య‌క్తిగ‌త ప్రాధాన్యాలను, ఆరోగ్యాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని.. అవ‌స‌ర‌మైతే వైద్యుల స‌ల‌హా మేర‌కు త‌గిన నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది.

Diabetes Control Tips In Telugu : మధుమేహంతో ఇబ్బందా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫుల్​ రిలీఫ్!

High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్​తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్​లకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.