ETV Bharat / state

ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ జన్మదిన వేడుకలు.. ప్రొద్దుటూరులో భారీ బందోబస్తు! - వైకాపా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వార్తలు

వైకాపా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

ysrcp mlc ramesh yadav birthday celebration

author img

By

Published : Jan 16, 2022, 3:09 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రొద్దుటూరులోని ఆయన కార్యాలయంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ఫ్లెక్సీ విషయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీపై వార్డు కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు..
ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్​పై.. వైకాపా పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి శనివారం తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్సీ రమేశ్.. నేరచరిత్ర గల వారని అన్నారు. తన కుటుంబానికి హాని చేస్తాడనే అనుమానం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంలో ఆయన అనుచరుడు రఘునాథ్​పై బ్లేడుతో గాయాలు చేసి.. ఆ కేసును తనపైకి నెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రమేశ్ యాదవ్ నేర చరిత్ర గురించి ఆయన వర్గీయులు తెలుసుకోవాలని కోరారు. ఈ పరిస్థితుల్లో పట్టణంలో ఎలాంటి ఘర్షణలూ చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి :
Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.