ETV Bharat / state

కమలాపురంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్​ ప్రారంభం

author img

By

Published : Nov 25, 2020, 4:17 PM IST

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్... వైఎస్సార్ విలేజ్ క్లినిక్​లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కడప జిల్లా కమలాపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న విలేజ్ క్లినిక్​ను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్ ప్రారంభించారు.

ysr village clinic has been inaugrated in kamalapuram at kadapa district
కమాలపురంలో ప్రారంభమైన వైఎస్సార్ విలేజ్ క్లినిక్​

కడప జిల్లా కమలాపురంలో నిర్మాణం పూర్తయిన విలేజ్ క్లినిక్​ను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్ ప్రారంభించారు. సుమారు 18 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్​లను అందుబాటులోకి తెవాలని నిర్ణయించారు. ఇది ఒక రిఫరల్ ఆసుపత్రిగా ఉంటూ 24 గంటలూ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో ఒక వైద్యునితో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఉంటూ 54 రకాల జబ్బులకు మందులు అందిస్తారు. ప్రాథమిక ఉప కేంద్రాలు లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

కౌన్సిలింగ్ సేవలు, ల్యాబ్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలు అందుబాటులో ఉంటాయి. కమలాపురం మండలంలో 13 ప్రాథమిక ఉప కేంద్రాలు లేని గ్రామాల్లో విలేజ్ క్లినిక్​లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి

'హెచ్చరిక.. కాలువలో మొసళ్లు తిరుగుతున్నాయ్.. లోనికి దిగకండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.