AP New Districts: రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై.. రాజంపేట వైకాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట ప్రజల అభిప్రాయం తీసుకోకుండా రాయచోటి జిల్లాలో కలపటంపై రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి మండిపడ్డారు. అన్నమయ్య పేరును ఆయన పుట్టినచోటుకు కాకుండా మరో ప్రాంతానికి పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాజంపేట.. కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కోడూర్, రాజంపేటలో వైకాపా ఓడిపోతుందని హెచ్చరించారు.
‘‘అన్నమయ్య పేరును ఆయన పుట్టిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి పెట్టారు. రాయచోటిని మదనపల్లిలో కలుపుకొని మరో జిల్లా ఏర్పాటు చేసుకోండి. రాజంపేట వాసులను అనాథల్లా రాయచోటిలో కలిపారు. ఇలా చేస్తే మేము ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైకాపా పరాజయం పాలవుతుంది. నా వైస్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తాను. రాజంపేటను కడప జిల్లాలో కొనసాగించాలి. లేదంటే రాజపేటను జిల్లా కేంద్రం చేయాలి" - మర్రి రవి, రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్
ఇదీ చదవండి: కరోనా దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. 40-50 శాతం గైర్హాజరు