ETV Bharat / state

THREAT: తెదేపా నేత నందం సుబ్బయ్యలాగే చంపేస్తారా?..జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్‌ ఆవేదన - వైఎస్సార్​ జిల్లా తాజా వార్తలు

THREAT: వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేరుతో..కొందరు తనను బెదిరించారంటూ.. వైకాపా నేత భాస్కర్ ఆరోపించారు. గతంలో నందం సుబ్బయ్యను చంపినట్లే.. తననూ హత్యచేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడబోమని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

THREAT
THREAT
author img

By

Published : Jul 5, 2022, 8:30 AM IST

THREAT: ‘వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బయ్యలాగే అందరినీ చంపేస్తారా!’ అంటూ రాజుపాళెం మండలం జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వెల్లాల నుంచి ద్విచక్ర వాహనంలో ప్రొద్దుటూరుకు వస్తుండగా కొర్రపాడు రోడ్డులోని టీవీఆర్‌ పెట్రోల్‌ బంకు వద్దకు రాగానే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వర్గీయులు రామాపురం గ్రామానికి చెందిన యాకోబ్‌, మరికొందరు కలిసి తనను బెదిరించారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అనంతరం భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రొద్దుటూరులో నియంతగా పాలన చేయాలనుకున్న వ్యక్తులు జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. నేను రాజుపాళెం జడ్పీటీసీ మాజీ సభ్యుడిని. నా భార్య రాజుపాళెం మండలం పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు. ఎమ్మెల్యే రాచమల్లు పంపించారని చెప్పి యాకోబ్‌, మరికొందరు నన్ను అడ్డగించారు.

ఎంపీటీసీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయిస్తారా లేక రూ.11 లక్షలు డబ్బులు కడతావా అని బెదిరించారు. డబ్బులు ఎందుకు కట్టాలని నేను ప్రశ్నించాను. ఎంపీటీసీ సభ్యురాలిగా ఏ విధంగా గెలిచారన్నారు. గెలిస్తే కూడా డబ్బులు ఇవ్వాలా అని ప్రశ్నించాను. నాకు ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వలేదు. మేం ప్రచారం..సేవ చేసి గెలిచాం. రౌడీలతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు...’ అని వివరించారు. ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే రాచమల్లు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మమ్మల్ని కొట్టడానికి..దౌర్జన్యాలు చేయడానికి ఎమ్మెల్యేని చేశామా!’ అంటూ రాచమల్లుపై ఆయన మండిపడ్డారు. తనకు మండలాధ్యక్షుడి పదవి ఇవ్వకపోయినా బరించానని, ఇప్పుడు దాడి చేసేందుకు మనుషుల్ని పంపడం ఏమిటన్నారు. భాస్కర్‌ వెంట సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, అయిదో వార్డు వైకాపా కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ అనుచరులు దుగ్గిరెడ్డి రఘునాథ్‌రెడ్డి, ప్రసాద్‌ ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.