ETV Bharat / state

అధికారులకు.. వైకాపా నాయకుడి బెదిరింపులు

ప్రకాశం జిల్లా కొరిశపాడు తహసీల్దార్​ కార్యాలయంలో వైకాపా నాయకుడు హల్​చల్​ చేశాడు. తాను సిఫార్సు చేసిన వారిని రేషన్​ డీలర్​గా నియమించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటికే వేరే వ్యక్తిని నియమించటం వల్ల అధికారులు కుదరదన్నారు. కోపోద్రిక్తుడైన అధికార పార్టీ నాయకుడు... అధికారులపై తీవ్రంగా దుర్భాషలతో రెచ్చిపోయాడు.

తహసీల్దార్​ కార్యాలయంలో వైకాపా నాయకుడి హల్​చల్​
author img

By

Published : Jul 25, 2019, 10:08 PM IST

తహసీల్దార్​ కార్యాలయంలో వైకాపా నాయకుడి హల్​చల్​

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండల రెవెన్యూ అధికారులపై వైకాపా నాయకుడు దౌర్జ్యాన్యానికి యత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. మండలానికి చెందిన సామారెడ్డి అనే వైకాపా నాయకుడు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తాను సిఫారసు చేసిన వ్యక్తికి రేషన్‌ డిపో డీలర్‌ షిప్ కేటాయించాలని కోరాడు. ఓ మంత్రి సిఫారసు లేఖనూ తీసుకువచ్చి సంబంధిత అధికారులకు అందజేశాడు. అప్పటికే వైకాపా నాయకులు వేరే వ్యక్తికి సిఫారసు చేయటం వల్ల కేటాయింపు పూర్తయిందని.. మార్పు కుదరదని అధికారులు చెప్పారు. ఆ విషయంపై సామారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులపై దుర్భాషలాడి... తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దాడికీ యత్నించాడు. వెంటనే విషయాన్ని సంబంధిత అధికారులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి :

ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన కండక్టర్ కూతురు

Intro:jk_ap_knl_31_25_dhesi_program_av_AP10130 సోమిరెడ్డి ఎమ్మిగనూరు

Body:దేశి

Conclusion:కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.