ETV Bharat / state

AP Govt On Loans: ఆ ప్రాంతాల్లోని.. మహిళల రుణాలు మాఫీ: ప్రభుత్వం

AP Govt On Loans: కడప జిల్లా రాజంపేట వరద ప్రాంతాల్లోని మహిళల రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్వాక్రా, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని మహిళలకు లబ్ధి చేకూరేలా.. రూ.8.98 కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలిచ్చింది.

author img

By

Published : Dec 11, 2021, 8:10 PM IST

ఆ ప్రాంతాల్లోని మహిళల రుణాలు మాఫీ
ఆ ప్రాంతాల్లోని మహిళల రుణాలు మాఫీ

AP Govt On Loans: కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంపేట మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన బాధిత మహిళల ఎస్​హెచ్​జీ రుణాలు, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని రుణాలను మాఫీ చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తంగా రూ.8.98 కోట్ల రుణాల్ని మాఫీ చేసేందుకుగానూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ స్వయం సహాయక బృందాల రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

రాజంపేట మండలంలోని గుండ్లూరు, మందపల్లి, పులపుత్తూరు, ఆర్.బుడుగుంటపల్లి, శేషాంబపురం, తాళ్లపాక రెవెన్యూ గ్రామాలకు చెందిన వారికి ఈ మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ గ్రామీణ బ్యాంక్, కెనరా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వివిధ పథకాల కింద ఉన్న మహిళల రుణాలను మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చిన ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందున ఏకకాల పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి

kanna babu on CBN: జగన్‌ను గద్దె దించడమే.. లక్ష్యంగా దుష్ప్రచారం : కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.