వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా అలంఖన్ పల్లెలో జరిగింది. అలంఖన్ పల్లెకు చెందిన ప్రతాప్‌కు కర్నూలు జిల్లాకు చెందిన సావిత్రితో మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి ప్రతాప్ వరకట్నం కోసం సావిత్రిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. వేధింపులు భరించలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సావిత్రి బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మూడు నెలల కిందటే సావిత్రిని ప్రతాప్‌ను మూడో వివాహం చేసుకోగా.. మొదటి భార్య ఇలాగే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత రెండో భార్య వదిలేసి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి: