లంకమల అభయారణ్యం వన్య ప్రాణులకు నిలయం. కడప జిల్లాలోని అట్లూరు మండలం వలస పాలెం అడవిని ఆనుకొని ఉంటుంది. దీంతోపాటుగా చెరువులు కూడా ఉండటం.. అలసిపోయిన జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికి వస్తాయి. ఇలా వచ్చే జంతువులు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రెండు రోజుల కిందట వీధి కుక్కలు దాడి చేయడంతో దుప్పి మృతి చెందగా.. తాజాగా మరో దుప్పి పిల్ల కుక్కల దాడిలో గాయపడి మరణించింది. ఎప్పటికప్పుడు వన్యప్రాణులు కుక్కల దాడిలో మృతి చెందటం.. అటు జంతు ప్రేమికులను ఇటు అటవీశాఖ అధికారులను కలచివేస్తోంది.
ఇవీ చూడండి...