కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి వదిలారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువ ఉంది. ఫలితంగా రిజర్వాయర్ నుంచి పెన్నాకు 5 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎగువ నుంచి నీటి విడుదల ఎక్కువయితే మరో 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. చేపల వేటకు వెళ్ళేవారు... పెన్నా పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 11.9 టీఎంసీల నీరు ఉండగా, మైలవరం జలాశయంలో 6 టీఎంసీలకు పైగా నీరు ఉంది.
ఇదీచూడండి.నిరంతర ప్రవాహం... నిండుకుండల్లా జలాశయాలు